కనీసం ఆవేదన వినిపించుకోరా..!

()  అసెంబ్లీలో ప్రతిపక్షం
గొంతు నొక్కుతున్న ప్రభుత్వం

() ఆవేదన తెలిపేందుకు సైతం నో

() నిరసన తెలిపిన జన నేత వైఎస్ జగన్

హైదరాబాద్) శాసనసభ లో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూనే
ఉంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వాకౌట్ చేసేందుకు, ప్రభుత్వం ఆడుతున్న అబద్దాల
మీద నిరసన తెలిపేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం
అడ్డుపడింది. దీని మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిలదీయటంతో పాటు, విపక్ష సభ్యులు
నేల మీద కూర్చొని నిరసన తెలిపారు.

       ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో
మైనార్టీల సంక్షేమం గురించి వైఎస్సార్సీపీ సభ్యులు అంజాద్ బాషా తదితరులు అడిగిన
ప్రశ్నకు ప్రభుత్వం తరపున మంత్రి రఘునాథ్ రెడ్డి సమాధానం చెప్పారు. ఇందులోని
అవాస్తవాల్ని బయట పెట్టి, నిరసన తెలిపేందుకు వాకౌట్ చేయాలని వైఎస్సార్సీపీ
ప్రయత్నించింది. అయితే వైఎస్సార్సీపీ కి ఏమాత్రం మైక్ ఇవ్వకుండా తర్వాత ప్రశ్నను
చేపట్టడం జరిగింది. తదుపరి ప్రశ్న మొదలైంది కాబట్టి దీనిమీద మాట్లాడటానికి కుదరదు
అని సాంకేతికంగా వంక చూపించే ప్రయత్నం చేసినప్పుడు దీని మీద వైఎస్సార్సీపీ అభ్యంతరం
తెలిపింది.

       మైక్ కావాలని చేయి ఎత్తి అడగటంతో
పాటు, గట్టిగా గొంతు వినిపించి చెప్పినా పట్టించుకోలేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
తర్వాత సభ దృష్టికి తీసుకొని వచ్చారు. కనీసం తమ ఆవేదనను తెలిపే అవకాశం కూడా
ఇవ్వరా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజల తరపున వాణి వినిపించాల్సిన బాధ్యత
ప్రతిపక్ష పార్టీల మీద ఉంటుందని, అటువంటి వాయిస్ వినిపించేందుకు తాము
ప్రయత్నిస్తున్నామని వివరించారు. మైనార్టీల సంక్షేమం మీద ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని,
అవాస్తవాల్ని అడ్డుకోకపోతే, అవే వివరాలు ప్రజల్లోకి వెళతాయని చెప్పారు. ఇప్పటికైనా
తమకు వాయిస్ వినిపించే అవకాశం ఇస్తామని హామీ ఇవ్వాలని స్పీకర్ కోడెల శివప్రసాద్
రావును కోరారు. ఈ విషయంలోనూ విషయాన్ని పక్క దారి పట్టించేందుకు టీడీపీ నాయకులు
ప్రయత్నించారు.

 

Back to Top