ఏలూరు(పశ్చిమగోదావరి): పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు ఎలాంటి ఉపయోగం లేదని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ఎత్తిపోతలతో ఉభయగోదారి జిల్లాలు ఎడారిగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు.<br/>పట్టిసీమ కంటే పోలవరం పైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కొత్తపల్లి సూచించారు. పోలవరం పూర్తయ్యే వరకు వైఎస్ఆర్ సీపీ రైతాంగానికి అండగా ఉంటుందని కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు.