నవ నిర్మాణ దీక్షలతో ఒరిగిందేమి లేదు

గురజాల: రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ది సాధించకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదని వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ సిద్దాడపు గాంధీ అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ రాజధానిలో ఇప్పటికి ఒక్క పని కూడా చేయకుండా కాలయాపన చేస్తూ ఊదర గోట్టే ప్రసంగాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ దొంగ దీక్షలు చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు.ఈ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సీఎం చూస్తున్నారన్నారు. ప్రచార ఆర్భాటాలే కానీ అభివృద్ది ఎక్కడ జరగలేదన్నారు.పేదలకు అందించే రేషన్‌ సరుకుల్లో సైతం కోత విదించి నిరుపేదలను మోసం చేస్తున్నారన్నారు. ఈ దీక్షలు ఒక్కరికి కూడా ఉపయోగ పడే విదంగా లేవని కార్యాలయాలను అధికారులు వదిలి దీక్షలతో కాలం వెల్లబుచ్చుతున్నారని ఎంతోమంది విద్యార్ధులు, రైతులు కార్యాలయాల్లో పనులు జరగకపోవడంతో ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో సీనియర్‌ నాయకులు మేకల శేషిరెడ్డి, కేతు శ్రీనివాసరెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, షేక్‌ నాసర్‌సైదా, వై సైదారెడ్డి, సోమా వెంకట్రావు, పి బాలకృష్ణారెడ్డి, కె చినకోటేశ్వరరావు, కత్తి చలమరాజు, సిహెచ్‌ కాశీబాబు, సత్తార్‌ తదితరులున్నారు.

Back to Top