కడప: ప్రభుత్వ నిర్లక్ష్యంతో గుక్కెడు మంచినీరు దొరక్క గ్రామాలు ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొనబోతున్నాయని కడపజిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాయచోటి ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని, అయితే కరువును ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి పరిస్థితులను అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈసమావేశంలో డీసీసీబీ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.