బెయిల్‌ రద్దు ప్రసారాల వెనుక బాబు హస్తం

హైదరాబాద్‌: పనిగట్టుకొని కొన్ని మీడియా ఛానళ్లు ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు అయినట్లుగా చూపిస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రసారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం పరిపూర్ణంగా ఉన్నట్లుగా భావిస్తున్నామన్నారు. వైయస్‌ జగన్‌ బెయిల్‌ మీదే ప్రసార కార్యక్రమాలు నడిపించే విధంగా చంద్రబాబే ఆదేశాలు ఇచ్చినట్లుగా స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో భూమన మాట్లాడారు. వైయస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటీషన్‌ను న్యాయస్థానం కొట్టిపారేసిందని స్పష్టం చేశారు.

Back to Top