రాజధాని నిర్మించే సామర్ధ్యం వైయస్‌ జగన్‌కే ఉంది

గ్రాఫిక్స్‌తో చంద్రబాబు మాయల మరాఠి
ఏపీ అసెంబ్లీ: నవ్యాంధ్రకు రాజధాని నిర్మించే సామర్థ్యం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికే ఉందని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, ఇంతవరకు ప్రతిపక్షం, అఖిలపక్షంతో చర్చించకుండా చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ రోజు రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉంటే వాటిపై చర్చించకుండా రాజధాని నిర్మాణంపై గ్రాఫిక్స్‌ డిజైన్లు అంటూ కాలయాపన చేస్తున్నారని, అందుకే ఆ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు వైయస్‌ఆర్‌సీపీ దూరంగా ఉందని రోజా పేర్కొన్నారు. శనివారం మీడియా పాయింట్‌లో రోజా మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మరో డ్రామాకు తెర లేపారు. ఉసరవెళ్లిలాగా రోజుకో రంగు మార్చుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ రోజు రాజధాని నిర్మాణంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అంటున్నారు. చాలా పెద్ద మనసుతో ప్రతిపక్షాన్ని ఇందుకు పిలిచామని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గు చేటు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. ఏ కార్యక్రమం చేపట్టిన అన్ని పార్టీలను పిలిచి చర్చించేవారు. అందరి అభిప్రాయాలను స్వీకరించేవారు. ఈ రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మించేందుకు శివరామకృష్ణ కమిటీ నివేదికలు అందిస్తే..∙వాటి గురించి చర్చించేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదు. 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూములు లాక్కొని ఈ రోజు గ్రీనరీకి ఉపయోగిస్తారట. అందులో ప్లాస్టిక్‌ పూలు పెడతారట. ఈ రోజు రాజధాని ప్రాంతంలో నిలువ నీడ లేదు. పోలీసులు, సందర్శకులు ఎండలో మాడిపోతున్నారు.

ప్రతిపక్షం అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు
రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వం ప్రతిపక్షం అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. రైతులకు ఇచ్చే ప్యాకేజీ విషయంలో మాతో ఎందుకు సంప్రదించలేదు. షిల్డు కవర్‌ డిజైన్‌పై ఎందుకు అఖిలపక్షాన్ని పిలువలేదని నిలదీశారు. రాజధానిలో yì జైన్‌లో చూపిన ఒక్క బిల్డింగ్‌ కూడా ఇక్కడ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. మహిళా సభ్యులకు మరుగుదొడ్లు లేవు. మహిళా పోలీసులు అవస్థలు పడుతున్నారు. గ్రాఫిక్స్‌ ప్రజలకు చూపి మభ్యపెడుతున్నారు. పొగ గొట్టాల డిజైన్ల్‌ చూపించారు. ఈ మాకీర్‌ సంస్థ నుంచి ఈ డిజైన్‌ ఎందుకు మార్చారని ఆమె ప్రశ్నించారు. ఆ రోజు ప్రతిపక్షాన్ని, అఖిలపక్షాన్ని పిలువకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు రెండు గ్రాఫిక్స్‌ చూపించారు. ఇవాళ మరో కొత్త గ్రాఫిక్స్‌ తీసుకొని వచ్చారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉంటే వాటిపై చర్చించకుండా బహుబలి 1,2,3 అని గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారు. 

వైయస్‌ జగన్‌ ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు
రాజధాని కట్టగల సమర్ధుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని రోజా అన్నారు. అందుకే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారని ఆమె వెల్లడించారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్నారని, ఇక్కడ మాత్రం కరకట్టపై నివసిస్తున్నారని తెలిపారు. బాబుకు రాజధాని కట్టాలనే ఉద్దేశం లేదని, అందుకే ఇలా బొమ్మలు చూపుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో రైతులకు ఉచిత కరెంటు ఇస్తామన్నారు. భూములు ప్యాకేజీపై ఇంతవరకు తేల్చలేదు. వాటి వీడియోలు అసెంబ్లీలో ప్లే చేస్తే మేం సంతోషిస్తామన్నారు. వీళ్లు డబ్బాలు కొట్టుకునే గ్రాఫిక్స్‌ చూపితే సహించమని హెచ్చరించారు. ధరల స్థిరీకరణకు రూ.5 వేల కోట్లు ఇస్తామన్న చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. వీటిపై చర్చించకుండా గ్రాఫిక్స్‌తో మాయలమరాఠిలా మోసం చేయాలని చూస్తే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని రోజా హెచ్చరించారు.
Back to Top