వైయస్ జగన్ కు ధన్యవాదాలు

హైదరాబాద్:  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి
కి ఆ పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు లోటస్ పాండ్ లోని
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ని కలిశారు. కాగా  వైయ‌స్సార్ కాంగ్రెస్
పార్టీ తరపున విజయ సాయిరెడ్డి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.  


ఈసందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డికి పుష్పగుచ్ఛం
అందించి శుభాకాంక్షలు తెలిపారు. విజయసాయిరెడ్డిని అభినందించిన వారిలో సీనియర్
నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మ, ఇతర నేతలు
ఉన్నారు.


 

Back to Top