తండ్రీ కొడుకులు జైలుకెళ్లడం తథ్యం..!

వైఎస్సార్ జిల్లా:రాజధాని పేరుతో చంద్రబాబు మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాజధాని నిర్మాణంలో రూ.1.50 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని అన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవన్న భయంతోనే తెలుగుతమ్ముళ్లు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని టీడీపీని నామరూపాల్లేకుండా చేయడం తథ్యమన్నారు.  

రైతుల నుంచి వేలాది ఎకరాల భూములు లాక్కుని..చంద్రబాబు తన బినామీ కంపెనీలైన సింగపూర్ కు దోచిపెడుతున్నారని రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. శంకుస్థాపన కోసం ఈవెంట్ కంపెనీలకు కాంట్రాక్ట్ లు ఇవ్వడం, వందలకోట్లు ఖర్చుచేయడం దుర్మార్గమన్నారు. అమరావతిలో నిర్మిస్తున్నది ఏపీ రాజధాని కాదని, అదొక మాయల రాజధాని అని రవీంద్రనాథరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పిలుపుమేరకు కడప కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా ఈదీక్షలను ప్రారంభించారు. ఈసందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు.

Back to Top