నంద్యాలలో మంత్రులకేం పని..?

  • మూడేళ్లలో లేని డబ్బు ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది
  • చంద్రబాబు దేశంలోని నంబరవన్ అవినీతి చక్రవర్తి
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం
హైదరాబాద్ః బాబు మాయమాటలు నమ్మి మోసపోవద్దని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, హైపవర్ కమిటీ అధ్యక్షుడు తమ్మినేని  సీతారాం నంద్యాల ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఇచ్చే జీవోలను నమ్మవద్దని సూచించారు. ఆయన దృష్టిలో జీవో అంటే గో అని అర్థమని...ఎన్నికల తదనంతరం జీవో అవసరం తీరాక గో అంటారని ఎద్దేవా చేశారు. నంద్యాలలో మంత్రులకేం పని అని తమ్మినేని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలనను వదిలేసి నెలన్నరగా అక్కడ ఏంచేస్తున్నారని ఫైర్ అయ్యారు.  అభివృద్ధి కోసమని ముఖ్యమంత్రి వందలకోట్లు ఇప్పుడు ప్రకటించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. మూడేళ్లలో లేని డబ్బు ఇప్పుడు ఎక్కడినుంచి వచ్చిందని కడిగిపారేశారు. మీ అభివృద్ధే గెలిపిస్తుందనుకుంటే,  2019నాటికి ఈ ఎన్నికను ముఖ్యమంత్రి రెఫరెండంగా స్వీకరిస్తారా..? అని తమ్మినేని సవాల్ విసిరారు. 

ఎన్నికల్లో ఏమని ఓట్లు అడుగుతావు బాబు..?. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేశామని అడుగుతారా..? ఇంటికో ఉద్యోగం ఇచ్చాం, నిరుద్యోగ భృతి ఇచ్చాం ఓటేయండి అని అడగుతారా..?నేతన్నలకు రుణాలు మాఫీ చేశామని అడుగుతారా..? ఏ ఒక్కటి చేయకుండా ప్రజలను ఏమని ఓట్లు అడుగుతారని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో నిన్నటి నోటిఫికేషన్ కు ముందు అభివృద్ధికోసమని ఒక్క పైసా అయినా విదిల్చారా బాబుపై అని నిప్పులు చెరిగారు.  16లక్షల హెక్టార్లలో 6 లక్షల్లో కూడ నాట్లు పడని పరిస్థితి ఉందన్నారు.  దేశమొత్తంమ్మీద అన్ని సెక్టార్ లు కలుపుకొని 7.0 శాతం గ్రోత్ రేట్ ఉందని కేంద్రమే ఒప్పుకుంటే... వ్యవసాయంలో గ్రోత్ రేటు 24 శాతం సాధించామని బాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పరిటాల రవి హత్య కేసులో చంద్రబాబుపై అనుమానాలున్నాయని తమ్మినేని అన్నారు. పరిటాల రవిని అడ్డుతొలగించుకునేందుకు బాబు కుట్రపన్నాడన్న ఆరోపణలున్నాయన్నారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయగలరా బాబు అని ప్రశ్నించారు.

పరిటాల రవి హత్య కేసులో బాబు ఆరోపణలు చేస్తే...ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ ఆనాడు కొడుకు మీదే సీబీఐ ఎంక్వైరీ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీబీఐ రిపోర్ట్ లో జగన్ పాత్ర లేదని స్పష్టంగా వచ్చిందన్నారు. వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు పాత్రపై అప్పటి కేబినెట్లో మంత్రిగా ఉన్న హరిరామజోగయ్య పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని  కూడ గుర్తు చేశారు. వీటిపై సీబీఐ ఎంక్వైరీ వేయగలరా బాబు..? అని తమ్మినేని ప్రశ్నించారు. అలిపిరి ఘటన తర్వాత  ప్రజాసేవకే అంకితమవుతాను, నేను మారాను మీరు మారండి అని మాట్లాడిన బాబు... దేశంలోనే అవినీతి చక్రవర్తిగా నంబర్ వన్ స్థానానికి ఎదిగారని ఎద్దేవా చేశారు. 

తాజా వీడియోలు

Back to Top