ఘనంగా తమ్మినేని జన్మదిన వేడుకలు

ఆమదాలవలస: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హైపవర్‌ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం జన్మదిన వేడుకులు ఆయన నివాసంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సేవాదల్‌ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌ల అధ్యక్షతన కేక్‌ కట్‌ చేసి పార్టీ కార్యకర్తలు, అభిమానులకు తినిపించారు. అనంతరం ఆయన ఫ్యాన్స్‌తో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం మాట్లాడుతూ... పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి కట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేయక తప్పదని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు బొడ్డేపల్లి అజంతాకుమారి, పొన్నాడ కృష్ణవేణి, దుంపల శ్యామలరావు, దుంపల చిరంజీవిరావు, మరాఠి వెంకటేష్, పార్టీ నాయకులు యండా విశ్వనాథం, చింతు విజయలక్ష్మి, సైలాడ దాసునాయుడు, పొన్నాడ చిన్నారావు, గురుగుబెల్లి చలపతిరావు, బొడ్డేపల్లి జోగారావు, బీవీ రమణమూర్తి, బొడ్డేపల్లి రాజు, మామిడి రమేష్, జేకే ఆశిష్‌ విశ్వనాథ్‌, సత్యనారాయణ, పొన్నాడ రామారావులతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Back to Top