ఏపీలో భయంకరమైన అవినీతి జరుగుతోంది

హైదరాబాద్ః ఏపీలో భయంకరమైన అవినీతి జరుగుతోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట  శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం కష్టాల్లో ఉంది. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నధ్యాసే ప్రభుత్వానికి లేకపోయిందని విమర్శించారు. టీడీపీ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏవీ ఏపీలో జరగడం లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఇబ్బందుల పట్ల ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు. 

Back to Top