విశాఖ మహాధర్నా వద్ద ఉద్రిక్తత

విశాఖపట్నంః మహాధర్నా వద్ద ఉద్రిక్తత నెలకొంది.  పోలీసులు మహాధర్నాకు అడ్డంకి సృష్టించడంపై వైయస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ధర్నా ప్రాంతంలో వాహనదారులను అనుమతిస్తూ కావాలనే పోలీసులు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల భూ కబ్జాలను నిరసిస్తూ వైయస్సార్సీపీ చేపట్టిన మహాధర్నాకు లెఫ్ట్ పార్టీలు, లోక్ సత్తా, ప్రజాసంఘాలు మద్దతు పలికారు.

Back to Top