గుంటూరులో ఉద్రిక్తత

పోలీసుల్ని అడ్డు పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డిని విచారణ పేరుతో వేధిస్తోంది. తుని ఘటనకు సంబంధం లేకపోయినా రోజంతా సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఉంచి వేధించారు. తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రభుత్వ దమనకాండను దుయ్యబట్టారు. ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. 

పోలీసుల వేధింపులకు నిరసనగా వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధర్నా చేశారు. ఆయన్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. పోలీసుల చర్యను ప్రజాస్వామ్యవాదులు ఖండించారు. 
Back to Top