ముద్దనూరులో ఉద్రిక్త వాతావరణం

వైయస్‌ఆర్‌ జిల్లా:  ముద్దనూరులో ఉద్రిక్తత నెలకొంది. చౌటుపల్లి ముంపువాసులను కలిసేందుకు బయలుదేరిన వైయస్‌ఆర్‌సీపీ నేత డా. సుధీర్‌ రెడ్డిని ముద్దనూరు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ.. పరిహారం చెల్లించకుండానే ముంపు గ్రామాలను నిర్బంధంగా ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు.

Back to Top