మంగళగిరి పోలీసు స్టేషన్‌ ఎదుట ఉద్రిక్తత

మంగళగిరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని విడుదల చేయాలని పార్టీ శ్రేణులు మంగళగిరి పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చెవిరెడ్డి అసెంబ్లీ ఆవరణలో శాంతియుతంగా దీక్ష చేపట్టగా సోమవారం ఉదయం మార్షల్స్‌ ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం అయిన కూడా ఎమ్మెల్యేను విడుదల చేయకపోవడంతో వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు పోలీసు స్టేషన్‌కు వద్దకు రాగా వారిని లోపలికి వెళ్లనివ్వకుండా స్టేషన్‌ గేట్లు మూసేశారు. దీంతో స్టేషన్‌ ముందే వారు బైఠాయించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, బీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..పోలీసు స్టేషన్‌ గేట్లు ఎందుకు వేశారో సమాధానం చెప్పాలని ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక్కడ 144 సెక్షన్‌ విధించామని చెబుతున్నారని, అసలు ఎప్పుటి నుంచి ఇక్కడ 144 సెక్షన్‌ అమలు చేశారని ప్రశ్నించారు. ఇదేనా నవ్యాంధ్ర ప్రదేశ్‌ అని నిలదీశారు. తీరు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆందోళనలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఐజయ్య, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top