వైయస్‌ జగన్‌ను కలిసిన న్యాయవాదులు


గుంటూరు: తెనాలి నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు కలిశారు. ఈ సందర్భంగా వారు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే ప్రత్యేక హోదా పోరాటానికి న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ..న్యాయవాదులకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలని, పక్కా ఇల్లు నిర్మించాలని, పిల్లలకు స్కాలర్‌షిపులు మంజూరు చేయాలని, ప్రతి కోర్టులో బార్‌ అసోసియేషన్‌ భవనం ఏర్పాటు చేయాలని వైయస్‌ జగన్‌ను కోరారు. అలాగే సీనియర్‌ అని చెప్పుకున్న చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు.   
 
Back to Top