రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా ఒక్క జగన్‌కే ఉంది

హైదరాబాద్, 13 సెప్టెంబర్ 2013:

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణం తరువాత మన రాష్ట్రంలో ఏర్పడిన దురదృష్టకర పరిస్థితులను చక్కదిద్దే సత్తా ఒక్క శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికే ఉందని తెనాలి మాజీ ఎంపి ‌వల్లభనేని బాలశౌరి అన్నారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలులో ఆయన శుక్రవారం కలిశారు. భేటీ అనంతరం బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ తాను శ్రీ జగన్ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. త్వరలో‌నే తాను వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరనున్నట్లు బాలశౌరి ప్రకటించారు. బాలశౌరితో పాటు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివా‌స్‌రెడ్డి కూడా ఉన్నారు.

అడ్డగోలుగా మన రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయా‌నికి వ్యతిరేకంగా బాలశౌరి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గత నెల మొదటివారంలోనే రాజీనా‌మా చేశారు. లోక్సభ ఎన్నికల్లో బాలశౌరి తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వై‌యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ ఇటీవల గుంటూరులో చే‌సిన సమర దీక్షకు బాలశౌరి మద్దతు కూడా ప్రకటించారు.

తాజా వీడియోలు

Back to Top