రైతులకే రూ. కోటి లీజు కింద చెల్లించాలి: ఆర్కే

హైదరాబాద్:  రైతుల నుంచి సాగు భూమి సేకరిస్తున్న ప్రభుత్వం వారికే ఎకరాకు రూ. కోటి చొప్పున  చెల్లించాలని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తున్న ప్రతి రైతు భూమికి 99 ఏళ్లపాటు లీజు కొనసాగించాలని, ఏడాదికి రూ. కోటి ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన వైస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. మంగళగిరి ప్రాంతంలో ఎకరాకు ఏడాదికి రూ. కోటి చొప్పున 33 సంవత్సరాల లీజులకు అమెరికాకు చెందిన ‘పై డేటా సెంటర్’ అనే సంస్థకు ఇవ్వాలని ఏపీ మంత్రి వర్గ సమావేశం నిర్ణయించిందని వివరించారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన చూపించారు. రైతుల అభీష్టానికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం రైతుల భుములు లాక్కుంటున్నారని విమర్శించారు.  విదేశీ సంస్థల మెప్పు పొంది అడ్డదారిలో సంపాదించడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణ ప్రాంతంలో విదేశీ సంస్థలు ఎంతమొత్తంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయో.. అంతే మొత్తం రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top