నా తండ్రిని చంపింది మీరు కాదా బాబూ

నంద్యాల: మా తండ్రైన వంగవీటి రంగ నిరాహార దీక్ష చేస్తుంటే  చంద్రబాబే చంపారని వంగవీటి రాధా ఆరోపించారు. ఈ రోజు మన అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. రాబోయే రోజుల్లో ఒక్కటే గుర్తు ఫ్యాన్‌..ఫ్యాన్‌ మాత్రమే వినబడాలి. వైయస్‌ జగన్‌ సభకు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారని, అయితే వైయస్‌ఆర్‌ కుటుంబంపై ఉన్న అభిమానంతో ప్రజలు వచ్చి శిల్పాను ఆశీర్వదిస్తున్నారు. మేం విజయవాడ నుంచి వచ్చాం. మా ఊరిలో దరిద్రం కొద్ది చంద్రబాబు అక్కడ ఉన్నారు. మాయ మాటలతో ఎక్కడిక్కడ రోడ్డు విస్తరణ అని మాయ మాటలు చెబుతున్నారు. అక్కడ ఎలాంటి రోడ్డు వేయలేదు. అదే మాటలు ఇక్కడ చెబుతున్నారు. బాబు మాటలు నమ్మొద్దు. నిరాహారదీక్ష చేస్తుంటే నా తండ్రి వంగవీటి రంగను హత్యచేయించింది నిజం కాదా? కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ కోసం పోరాటం చేస్తుంటే ముద్రగడను అడ్డుకుంటున్నారు. వైయస్‌ఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు అన్న వస్తున్నాడని చెప్పి ప్రజల్లోకి వెళదాం.  ఉప ఎన్నికలో టీడీపీకి సరైన బుద్ధి చెప్పాలి. మీ అందరి ఆశీస్సులు ఎల్ల వేళలా వైయస్‌ఆర్‌కుటుంబానికి ఉంటాయని కోరుతున్నాను.

Back to Top