తెలుగుదేశం బాబాల మోసాలు

విజయవాడః రైతుల రుణాలు మాఫీ చేయకుండా చేశామని అబద్ధాలు చెబుతున్న తెలుగుదేశం బాబాలను ఏం చేయాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ప్రశ్నించారు. ఇలాంటి వారిని కాలర్ పట్టుకొని నిలదీయాలా, తరిమికొట్టాలా..? అని అన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు అందరినీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు బాబాల అవతారమెత్తి ఇంటింటికీ వెళ్లి మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top