ఎడారిదేశాల్లో తెలుగు మహిళల ఆత్మహత్యలు

వైయస్‌ఆర్‌ జిల్లా

:  ఎడారి దేశాల్లో ఇటీవల తెలుగువారి ఆత్మహత్యలు అధికమైయ్యాయని గల్ఫ్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనరు ఇలియాస్, కువైట్‌ కన్వీనరు ముమ్మడి బాలిరెడ్డి ఆందోళన చెందారు. బుధవారం పట్టణంలో తమ కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడుతూ గల్ఫ్‌దేశాలలో మృతి చెందిన వారిలో అధికంగా మహిళలే ఉన్నారన్నారు. వీరందరిని కాపాడుకోవాలంటే వీరు చట్ట వ్యతిరేకంగా వచ్చిన వారు కావడం వల్ల ఎటువంటి న్యాయం చేయలేని పరిస్ధితులు ఏర్పడ్డాయన్నారు. చట్టవ్యతిరేకంగా గల్ఫ్‌దేశాలకు మహిళలను పంపడం చట్టరీత్యాలు చర్యలు కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నార. 2017లో సౌదీయాకు వెళ్లిన మహిళలు అక్కడ స్పాన్సర్స్‌పెట్టే బాధతలు తట్టుకోలేక మృతి చెందిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చట్టపరంగా జీవనోపాధి కోంస గల్ఫ్‌దేశాలకు వెళితే అటువంటవారికి ఎదైనా అన్యాయం జరిగితే వారిని కాపాడుకునేందుకు సేవాసంస్ధలు, రాయబారి కార్యాలయాలు ముందుకురాగలన్నారు. ప్రత్యేకించి గల్ఫ్‌దేశాలలో జీవనోపాధిక కోసం రావాలనుకున్న మహిళలు రావడానికి చట్టపరంగా అవసరమైన వాటన్నింటిని కలిగినప్పుడే రావాల్సి ఉంటుందన్నారు. ఏజెంట్ల మోసపూరిత మాటల నమ్మి, గల్ఫ్‌దేశాలలకు దొడ్డిదారిన చేరుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలతో చివరికి జీవితాలనే బలిగొంటుందన్నారు. అలా కాకుండా చట్టరీత్యా అనుమతులతో గల్ఫ్‌దేశాలకు జీవనోపాధి కోసం అటువంటి వారి కోసం ఇండియన్‌ ఎంబసీ ఎటువంటి సహాయం చేయగలదనే విషయాన్ని ప్రధానంగా మహిళలు గుర్తుంచుకోవాలన్నారు. గల్ఫ్‌దేశాలలో సమస్యలు ఎదుర్కొనే మహిళలు రాయబారి కార్యాలయాలను సంప్రందించాలన్నారు. అలా కాని పక్షంలో మహిళలు తమ సమస్యలు స్ధానికంగా ఉండే తెలుగువారి సంస్ధల నేతలను ఆశ్రయిస్తే వారి ద్వారా అయిన ఎంబీసీ నుండి న్యాయం పొందవచ్చునన్నారు. తమ వారిని కువైట్, సౌదియాకు పంపుతుంటే వారికి సంబంధించి అన్ని పత్రాలను భద్రంగా ఉంచుకోవాలన్నారు. పాస్‌పోర్టు, ఈజా, ఇండ్రస్టీనకలు, ఇతర గుర్తింపు పత్రాలను భద్రపరుచుకోవడ వల్ల గల్ఫ్‌ దేశాలలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన వాటిని పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు. సమావేశంలో కువైట్‌  వైయస్‌ఆర్‌సీపీ సలహాదారులు శ్రీనువాసులరెడ్డి, నాగిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, కృష్ణచైతన్యసేవాసంస్ధ అధినేత వజ్రశేఖరరెడ్డి, రాజంపేట రైతుసంఘం కన్వీనరు గోవిందుబాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top