అంద‌రికీ అండ‌గా ఉంటాచిత్తూరు: అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం కాగానే క‌లికిరి వ‌ద్ద పీలేరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన తెలుగు రాష్ట్రాల క‌మ్యూనిటి సంక్షేమ సంఘం నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు వివ‌రించారు.  ఫార్వర్డ్ కమ్యూనిటీ ప్రతినిధులు పేద కుటుంబాల ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేద కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని కోరారు. ఇందుకు స్పందించిన వైయ‌స్ జ‌గ‌న్ అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.  


Back to Top