టీడీపీ సెటిల్ మెట్ సమ్మిట్ లు

విశాఖలో లక్ష ఎకరాల్లో భూ కుంభకోణం జరిగిందని వైయస్సార్సీపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. పార్ట్ నర్ షిప్ సమ్మిట్ పేరుతో  ముఖ్యమంత్రి, లోకేష్ లు తన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సెటిల్ మెంట్ సమ్మిట్ లు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం భూ కబ్జాలకు పాల్పడి దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ పేరును చెడగొట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొని ఏకంగా వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు

Back to Top