తెలంగాణ వైయస్సార్సీపీ ప్లీనరీ ప్రారంభం

హైదరాబాద్‌: వైయస్సార్‌సీపీ తెలంగాణ ప్లీనరీ సమావేశం గురువారం(నేడు) హైదరాబాద్‌లో ప్రారంభమైంది.  రాష్ట్రం నలుమూలల నుంచి వైయస్సార్‌ సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఎల్‌బీనగర్‌ ప్రాంతంలోని చంపాపేట్‌ రోడ్డులోని ఎస్‌ఎన్‌ రెడ్డి గార్డెన్స్‌(సామ నరసింహా రెడ్డి గార్డెన్‌)లో పార్టీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్లీనరీకి  ముఖ్య అతిథిగా వైయస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. 

ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా మొత్తం 10 తీర్మానాలను ప్లీనరీ సమావేశంలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టో అమలులో అధికార టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, సంక్షోభంలో వ్యవసాయ రంగం, నకిలీ విత్తనాల బెడద, రైతు ఆత్మహత్యలు, పంటలకు దక్కని గిట్టుబాటు ధరలు, నత్తనడకన ప్రాజెక్టుల నిర్మాణం, రీడిజైనింగ్, భూ సేకరణ అంశాలపై తీర్మానాలు, చర్చ ఉంటుందని పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 
Back to Top