హోదా ఆందోళనకు తెలంగాణలో మద్దతు

కరీంనగర్‌: ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఆందోళనకు తెలంగాణవాదులు సంఘీభావం ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించి నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్‌లో వైయస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది.

తెలంగాణ చౌక్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను నాయకులు, కార్యకర్తలు దగ్ధం చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందనే విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నగేష్‌, కార్యదర్శి అజయ్‌ వర్మలు అన్నారు.
Back to Top