తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్:
 వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా
నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర
అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన
ప్రసంగిస్తూ, గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పట్టించుకోని టిఆర్ఎస్
ప్రభుత్వం, ఎన్నికల సంవత్సరంలో ఒకేసారి 18 వేల ఉద్యోగాల  భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. నాలుగేళ్లుగా
ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.

అనంతపురం
ఎంపి జెసి దివాకర్ రెడ్డి వైయస్ఆర్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు
చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన తన వైఖరిని మార్చుకోకుంటే ఉపేక్షించేది
లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ ఆర్ సీపీ తెలంగాణ నాయకులు బొడ్డు సాయినాథ్
రెడ్డి, రవికుమార్, మహిళా విభాగం నాయకులు అమృతా సాగర్, ప్రపుల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top