రాక్షస పాలన అంతమొందించేందుకే పాదయాత్ర

నిరుపేదలను అభివృద్ధి చేసిన మహానుభావుడు వైయస్‌ఆర్‌ 
అలాంటి సువర్ణ పాలన జగనన్నతోనే సాధ్యం
వెయ్యి కిలోమీటర్లకు సంఘీభావంగా లోటస్‌పాండ్‌ వద్ద పాదయాత్ర
హైదరాబాద్‌: చంద్రబాబు రాక్షస పాలనను అంతమొందించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌ వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, మతిన్‌ తదితరులు పాల్గొని ముందుగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గట్టు శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్రంలోని మహిళలు, కార్మికులు, రైతులు, యువత అభివృద్ధి కోసం జననేత పాదయాత్ర చేపట్టారన్నారు. నాడు వైయస్‌ఆర్‌ ఎలా పాదయాత్ర చేసి చంద్రబాబు నరహంతక పాలనను అంతమొందించారో.. వైయస్‌ జగన్‌ కూడా పాదయాత్ర ద్వారా మోసకారి ప్రభుత్వాన్ని కడతేర్చనున్నారన్నారు. పాదయాత్ర ద్వారా వైయస్‌ఆర్‌ ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి అభివృద్ధికి పాటుపడిన మహానుభావుడు అన్నారు. అదే విధంగా వైయస్‌ జగన్‌ కూడా ప్రజల సమస్యలన్నీ నెరవేర్చి రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకువస్తారన్నారు. 
అడుగులో అడుగేస్తున్నారు..
ప్రపంచ వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ అభిమానులు జై జగన్‌ అంటూ.. జగనన్నా నీ వెంటే మేమున్నాం అంటూ అడుగులో అడుగు వేస్తున్నారని గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌ వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంటుండడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సంఘీభావ పాదయాత్ర చేపట్టం జరిగిందన్నారు. వందల వాగ్ధానాలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోగా రాష్ట్రాన్ని అవినీతిమయంగా తయారు చేశారని గట్టు మండిపడ్డారు. ఈ అవినీతి పాలనకు ముగింపు పలకడానికి వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. వైయస్‌ జగన్‌ ఆయురారోగ్యాలతో పాదయాత్ర చేపట్టాలని దేవుడిని ప్రార్థించడం జరిగిందన్నారు. 
వెయ్యి కిలోమీటర్లు పూర్తి సంతోషంగా ఉంది: వాసిరెడ్డి పద్మ
నవంబర్‌ 6వ తేదీన ఇడుపులపాయలో వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం అంటే ఒక సామాన్యుడు సీఎం కావడమేనని, ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం జననేత మేనిఫెస్టో రూపొందించనున్నారన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో వైయస్‌ జగన్‌ హామీలకు, నవరత్నాలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుందన్నారు. వెయ్యి కిలోమీటర్ల పూర్తి సందర్భంగా వాక్‌విత్‌ జగన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాసిరెడ్డి పద్మ ధన్యావాదాలు తెలిపారు. 
 

తాజా వీడియోలు

Back to Top