తెలంగాణ ఏర్పడితే రెండు రాష్ట్రాల్లో వైయస్‌ఆర్‌సిపి

చౌటుప్పల్ (న‌ల్గొండ జిల్లా) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రకటిస్తే రెండు రాష్ట్రాల్లోనూ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఉంటుందని పార్టీ దక్షిణ తెలంగాణ జిల్లాల సమన్వయకర్త జిట్టా బాలకృష్ణారెడ్డి ధీమాగా చెప్పారు. నల్గొండ జిల్లా మర్రిగూడలో శనివారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ముందుగా చెప్పినట్టుగానే తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నారని, ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పారు.

నల్గొండ జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోందని జిట్టా అన్నారు. శ్రీమతి షర్మిలకు లభిస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారన్నారు. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో మునుగోడు నియోజకవర్గంలో తన ఉనికికి ప్రమాదం వస్తుందనే అక్కసుతోనే ఆయన పసలేని ఆరోపణలు చేస్తున్నారని జిట్టా విమర్శించారు.
Back to Top