వైయస్సార్‌ సీపీలో చేరిన టీడీపీ నాయకులు

టెక్కలి: సంతబొమ్మాళి మండలం వడ్డివాడ గ్రామానికి చెందిన సుమారు 50 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్సార్‌ సీపీలోకి చేరారు. టెక్కలిలో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశంలో పార్టీ ముఖ్యనేతల సమక్షంలో వీరంతా పార్టీలోకి చేరారు. వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, హైపవర్‌ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాసు, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి వీరిని పార్టీలోకి ఆహ్వనించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి తామంతా కృషిచేస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎం.బలరాం, ఎం.సింహాచలం, బి.రమణయ్య, ఆర్‌.ఢిల్లేశ్వరరావు, కె.టి.నాయుడు, సీహెచ్‌.సూర్యనారాయణ, పి.సింహాచలం తదితరులు ఉన్నారు.

Back to Top