వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో టీచర్‌ డే వేడుకలు

హైదరాబాద్ః  లోటస్‌పాండ్‌ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో టీచర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఉపాధ్యాయులను ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు పద్మజా అన్నారు. ప్రచార కార్యకర్తలుగా వినియోగించుకుని అధికార దుర్వినియోగానికి  పాల్పడుతున్నారని విమర్శించారు. రాబోయే రోజులోలో వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఉపాధ్యాయులకు గౌరవమైన స్థానం దక్కబోతుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ రా«ధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు.
 
Back to Top