టీడీపీ కక్షసాధింపు చర్యలు

గుంటూరుః తుని ఘటనను అడ్డం పెట్టుకొని వైయస్సార్సీపీపై ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని పార్టీ నేతలు మండిపడ్డారు. ఈనెల 19న విచారణకు హాజరు కావాలంటూ  సీఐడీ భూమనకు మరోసారి నోటీసులు పంపడాన్ని పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రత్యేకహోదా రాలేదన్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు సర్కార్ విచారణ పేరుతో భూమన కరుణాకర్ రెడ్డిపై వేధింపులకు పాల్పడుతోందని వైయస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు...  భూమన కరుణాకర్ రెడ్డిని రెండ్రోజుల పాటు సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. తుని ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా ప్రభుత్వం కావాలనే వైయస్సార్సీని బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తుందని భూమన తీవ్రంగా మండిపడ్డారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top