టీడీపీకి రాజ‌కీయ స‌మాధి ఖాయం

  • రాష్ట్రాభివృద్ధిని తాకట్టుపెట్టిన నీచుడు చంద్రబాబు
  • ప్యాకేజీ కోసం నీచస్థితికి దిగజారిపోయాడు
  • హోదా కోసం మొదటినుంచి పోరాడుతుంది ఒక్క వైయస్ జగనే
  • ప్రత్యేకహోదా వచ్చే వరకు వైయస్సార్సీపీ పోరాటం కొనసాగుతుంది

హైద‌రాబాద్‌: ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టిన చంద్ర‌బాబును శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పించే విధంగా ప్ర‌జ‌లు తొక్కేస్తార‌ని వైయ‌స్సార్‌సీపీ చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి అన్నారు. టీడీపీని ప్ర‌జ‌లు రాజకీయ స‌మాధి చేస్తార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ప్ర‌తి వ్యాపార‌వేత్త‌, పారిశ్రామిక వేత్త‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చి పెట్టుబ‌డులు పెడ‌తార‌ని, ప్ర‌త్యేక హోదా భావిత‌రాలకు చెందిన యువ‌త భ‌విష్య‌త్తు అని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిభాస్క‌ర‌రెడ్డి అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ప్యాకేజీలు ఇస్తే పారిశ్రామిక వేత్త‌లు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకు రార‌ని ఆయ‌న పేర్కొన్నారు.  ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కొపోయి రాష్ట్రాభివృధ్ధిని కేంద్రానికి తాక‌ట్టు పెట్టిన నీచుడు చంద్ర‌బాబు నాయుడ‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.  రాష్ట్ర‌వ్యాప్త బంద్‌కు  అన్ని పార్టీలు క‌లిసి రావాలని విజ్ఞప్తి చేశారు.  

రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను తాక‌ట్టు పెడితే ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయో రాష్ట్ర‌వ్యాప్త బంద్ ద్వారా ప్ర‌భుత్వానికి చూపిస్తామన్నారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి 30 సెకండ్లు కూడా మైక్ ఇవ్వ‌క‌పోవ‌డం దారుణమన్నారు. సబ్జెక్ట్‌పైన అవ‌గాహ‌న లేని టీడీపీ ఎమ్మెల్యేకు గంట‌ల కొద్ది మైక్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కేవ‌లం వైయ‌స్సార్సీపీ స‌భ్యుల‌ను తిట్టేందుకే టీడీపీ స‌భ్యుల‌కు మైక్‌ల‌ను ఇస్తున్నారని విమర్శించారు. దీక్ష‌లు, ధర్నాలు, బంద్ లు యువ‌భేరీలు, గడపగడపకూ కార్యక్రమం ద్వారా  ప్ర‌త్యేక హోదా గురించి వైయస్సార్సీపీ ప్రజలను చైతన్యపరుస్తోందన్నారు. మోడీ, వెంక‌య్య‌నాయుడు. చంద్రబాబులు ఏపీని ఆధోగ‌తి పాలు చేస్తున్నారని, భ‌గ‌వంతుడి సాక్షిగా ఇచ్చిన మాట‌ను విస్మరించారని ఫైర్ అయ్యారు. 

ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఏపీని విభజించిన రోజు తెలుగువాడు ఏవిధంగా బాధపడ్డారో..ఈరోజు టీడీపీ, బీజేపీలు అదే అన్యాయం చేశారని ఆర్కే ఫైర్ అయ్యారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు హోదా లేదనడం బాధాకరమన్నారు. ఓసారి మాట అంటూ ఇస్తే మహానేత వైయస్సార్, వైయస్ జగన్ లాగా దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డందా దొరికిపోయిన చంద్రబాబు హోదా అడగలేక ..కేంద్రం చెప్పిన దానికల్లా తలఊపూతున్నాడని ధ్వజమెత్తారు. బాబు ఏం మొహం పెట్టుకొని స్టేట్ మెంట్ ఇస్తానంటున్నాడని మండిపడ్డారు. తమ అధ్యక్షులు వైయస్ జగన్ మొదటినుంచి చెప్పినట్లుగా ఏపీకి చెందిన టీడీపీ, బీజీపీ మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మీ రాజకీయం కోసం ఏపీ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టవద్దని హెచ్చరించారు.  పార్టీలకతీతంగా ఐదుకోట్ల మంది తెలుగుప్రజలు హోదాను కోరుతున్నారు. పరిశ్రమలు రాలేదు. అభివృద్ధి లేదు. హామీలు నెరవేర్చలేదు. పన్నులతో బాదుతున్నారు. ప్రత్యేకహోదా వస్తేనే తమ భవిష్యత్తు బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని ఆర్కే తెలిపారు. 

కొరుముట్ల శ్రీనివాసులు
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రత్యేకహోదా కోసం పోరాడుతుంది ఒక్క వైయస్సార్సీపీ మాత్రమేనని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు అని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెడుతున్నారని ఆగ్రహించారు. హోదా ఐదుకోట్లమంది ప్రజల ఆకాంక్ష అని అన్నారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు.  హోదా ఐదేళ్లని కాంగ్రెస్, పదేళ్లు కావాలని బీజేపీ, పదిహేనేళ్లు కావాలన్న టీడీపీ మాట తప్పాయన్నారు. ప్రత్యేకహోదాపై చర్చ అంటే ఎందుకు భయపడుతున్నారని అధికార టీడీపీని నిలదీశారు. హోదా తీసుకురాకపోతే బాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైయస్ జగన్ నేతత్వంలో హోదా వచ్చే వరకు పోరాడుతామని తేల్చిచెప్పారు. 

ముస్తఫా
ఏపీలో ఒక్క పరిశ్రమ లేదు. ఉద్యోగాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో హోదా కోసం చంద్రబాబు పోరాడరు. తమతో కలిసిరమ్మంటే రావడం లేదు. హోదా వస్తే పర్సెంట్  రాదనుకుంటున్నాడేమో. ఏపీ  వెనుకబడింది. రాష్ట్ర ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఐనా  బాబుకు ఎందుకు పట్టడం లేదో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. ప్రత్యేకహోదా కోసం రెండున్నరేళ్లుగా పోరాడుతుంది వైయస్ జగన్ మాత్రమేనని చెప్పారు. 
Back to Top