టీడీపీది దోపిడీ పాలన

తూర్పు గోదావరి: తెలుగు దేశం ప్రభుత్వానిది దోపిడీ పాలన అని రాజమండ్రి ఇన్‌చార్జ్‌ రౌతు సూర్యప్రకాశ్‌ విమర్శించారు.  పేదవాడి కంట కన్నీళ్లు తుడిచేందుకు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వైయస్‌ జగన్‌ మన కోసం వచ్చారన్నారు.  2019లో వైయస్‌ఆర్‌సీపీ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం కాకినాడ సంత చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో దోపిడీ విఫరీతంగా జరుగుతుందని, మట్టి, ఇసుక, మద్యం, చివరకు గుడి భూములు కూడా వదలడం లేదని విమర్శించారు.
Back to Top