టీడీపీది రెండు నాల్కల ధోరణి

  • హోదా బిల్లును టీడీపీ నీరుగారుస్తోంది
  • ఏపీకీ బాబు అన్యాయం చేస్తున్నాడు
  • టీడీపీ ముఖ్య ఉద్దేశ్యం ముడుపులే
  • వైయ‌స్సార్సీపీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌థి 

హైద‌రాబాద్‌:  ప్ర‌త్యేక హోదా కోసం అన్ని రాజ‌కీయ పార్టీలు... స్వ‌చ్చంధ సంస్థ‌లు... ప్ర‌జ‌లు ఎన్నో ఉద్య‌మాలు చేస్తున్నా చంద్ర‌బాబుకు క‌నీసం చీమ‌కుట్టిన‌ట్లు కూడా లేద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జరిగిన మీడియా స‌మావేశంలో పార్థసారథి మాట్లాడుతూ ..  హోదా కోసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ  వైయస్సార్సీపీ చేసిన ఉద్యమాలను గుర్తు చేశారు. హోదా విషయంలో టీడీపీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని పార్థసారథి ఫైర్ అయ్యారు. 

ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే...

* ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అన్యాయం చేయ‌డం కోస‌మే టీడీపీ అధికారంలోకి వ‌చ్చిందా..? అన్న అనుమానం ప్ర‌జ‌ల్లో క‌లుగుతుంది.
* అప్ప‌టి ప్ర‌ధాని ఐదేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌న్న విష‌యం టీడీపీ గుర్తుకు తెచ్చుకోవాలి
* ఐదేళ్లు కాదు ప‌దేళ్లు హోదా కావాల‌ని ఆనాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ, టీడీపీలు డిమాండ్ చేశాయి... 
* అధికారంలోకి వచ్చిన ఆ రెండు పార్టీలు హోదాను విస్మరించాయి. 
* ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఇప్ప‌టికే అనేక‌మార్లు చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఇప్పుడు కొత్త‌గా చ‌ర్చించేదీ ఏముంది..?
* ప్ర‌త్యేక హోదా బిల్లును టీడీపీ కావాల‌నే నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తోంది.
* టీడీపీ స్వార్థ్య రాజ‌కీయాల కోస‌మే ప్ర‌త్యేక హోదా విష‌యంలో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తోంది.
* హోదా రాకపోవడం వల్ల అస‌లు ఏపీ రీఆర్గనేజేషన్ బిల్లు పాస్ అయిందా?  లేదా? అన్న అనుమానం ప్ర‌జ‌ల్లో ఉంది
* రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఏపీకి ఎన్నో నిధులు మంజూరు చేశామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతుంటే... కేంద్ర ప్ర‌భుత్వం నుంచి స‌రైన స‌హాయం అంద‌లేద‌ని బాబు చెప్ప‌డం విడ్డూరంగా ఉంది.
* ఇప్ప‌టికే సుమారు రూ .ల‌క్ష 50 వేల కోట్లు ఏపీకి కేటాయించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వ ఆర్థిక శాఖ పేర్కొంది.
* కాగ్ నివేదిక ప్ర‌కారం  జూన్ 2 ‍‍‍-2014 నుంచి 3 మార్చి 2015 వ‌ర‌కు తెలంగాణ‌, ఏపీకి క‌లిసి రూ.  ల‌క్ష 16వేల 737 కోట్లు వ‌చ్చిన‌ట్లు కాగ్ నివేదిక పేర్కొంది. 
* అందులో తెలంగాణ‌కు రూ. 51 వేల 42 కోట్లు....
* ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ. 65 వేల 695 కోట్లు వ‌చ్చాయి.. దీనిని బ‌ట్టి తెలంగాణ‌కు 44 శాతం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 56 శాతం వ‌చ్చింది
* మాములుగా అయితే తెలంగాణ‌కు 42 శాతం, ఆంధ్రప్ర‌దేశ్‌కు 58 శాతం రావాల్సి ఉంటుంది.
* కాగ్ నివేదిక‌కు కేవ‌లం 2 శాతం మాత్రమే తేడా ఉంది... ఆర్థిక మంత్రి మాత్రం 12 శాతం తేడా ఉంద‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
*  ఇచ్చిన హామీల నుంచి త‌ప్పించుకునేందుకే ఆర్థిక శాఖ మంత్రి ఇలాంటి త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు.
* కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకున్న పోల‌వ‌రం బాధ్య‌త ఏమైంది..?
* అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి పోల‌వ‌రం పూర్తి నిర్మాణ బాధ్య‌త‌ను కేంద్ర ప్ర‌భుత్వమే తీసుకుంటుంద‌న్నారు. 
* కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్పుడు ఏపీ సీఎం పోల‌వ‌రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావ‌డం లేదు
* రాష్ట్రంలోని అన్ని ప్ర‌తిప‌క్షాల‌తో క‌లిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అధికార స‌ర్కారే నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హరిస్తుంది.
* తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం ముడుపులే.
* తాము బ్యాలెన్స్‌షీట్ వేయాలంటున్న మంత్రి సుజ‌నచౌద‌రి....కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడుగుతున్నారా..?  లేక రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని అడుగుతున్నారా ..?

Back to Top