టీడీపీని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం..!

గుంటూరుః ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్ ను ప్రజలు ఏవిధంగానైతే కూకటివేళ్లతో పెకిలించి వేశారో అదేమాదిరి రానున్న ఎన్నికల్లో టీడీపీని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకొని ప్రత్యేకహోదా సాధన కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ కు మద్దతు ఇవ్వాలన్నారు. 

ఐదు కోట్ల ప్రజల బంగారు భవిష్యత్ కోసం వైఎస్ జగన్ దీక్ష చేపడితే...టీడీపీ నేతలు దిగజారి, స్థాయి మరచి ప్రవర్తించారని లేళ్ల అప్పిరెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి వైఎస్సార్సిపీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోందని లేళ్ల తెలిపారు. అదేవిధంగా దీక్షను జయప్రదం చేయడానికి ముందుకు సాగిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ప్రధాని తప్పనిసరిగా రాష్ట్రానికి హోదాపై ప్రకటన చేస్తారన్న ఆశాభావంతో ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. 
Back to Top