టీడీపీ మీదే అనుమానాలు

విజ‌య‌న‌గ‌రం : పుష్క‌రాల ఘ‌ట‌న‌పై తెలుగుదేశం నేత‌లు కావాల‌ని ర‌క ర‌కాల
మాట‌లు మాట్లాడుతున్నార‌ని వైఎస్సార్‌సీపీ నాయ‌కుడు, మాజీమంత్రి బొత్సా
స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఆ ప‌నులు టీడీపీ నే చేసి ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న అనుమానం
వ్య‌క్తం చేశారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం మునిసిప‌ల్ కార్మికులు
విజ‌య‌న‌గ‌రంలోని ఆయ‌న నివాసంలో బొత్స‌ను క‌లిశారు. పరిష్కారం కోసం కృషి
చేయాలంటూ విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా బొత్స మాట్లాడుతూ..
పారిశుద్య కార్మికుల స‌మ్మె పై ప్ర‌భుత్వం ఒంటెద్దు పోక‌డ అవ‌లంబిస్తోంద‌ని
ఆరోపించారు. కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న హామీ
ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో పుష్క‌రాల ఘ‌ట‌న మీద మాట్లాడుతూ.. టీడీపీ నేత‌లే
దీనికి మూలం కావ‌చ్చు అని ఆయ‌న అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఇటువంటి
కుట్ర‌పూరిత కార్య‌క్ర‌మాలు టీడీపీ కి వెన్న‌తో పెట్టిన విద్య అని ఆయ‌న
వ్యాఖ్యానించారు. ముఖ్య‌మంత్రి రాజ‌మండ్రిలో ఉండ‌గానే జ‌రిగిన ఘ‌ట‌న‌కు
ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని ఆయ‌న నిల‌దీశారు. రాజ‌ధాని పేరుతో చంద్ర‌బాబు
చేస్తున్న‌ది పాల‌న కాద‌ని, వ్యాపార‌మ‌ని బొత్స అభివ‌ర్ణించారు.
Back to Top