విశాఖలో టీడీపీ నేతల భూ దోపిడీ

  • 550 ఎకరాలు కొట్టేసేందుకు మంత్రులు కుట్ర
  • మంత్రి గంటా శ్రీనివాసరావును భర్తరఫ్‌ చేయాలి
  • పేద రైతుల కడుపు కొట్టేందుకే పార్టనర్‌షిప్‌ సమ్మిట్లు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్‌

  • విశాఖ: తెలుగు దేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖపట్నంలో భూ దోపిడీకి పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు. విశాఖలో అధికార పార్టీ వైట్‌ కాలర్‌ దోపిడీకి పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. పేదల అసైన్డ్‌ భూములు లాక్కొవడానికి  మున్సిపల్‌ శాఖ మంత్రి విడుదల చేసిన నోటిఫికేషన్‌పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం గుడివాడ అమర్నాథ్‌ హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్య వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో  పేదల అసైన్డ్‌ భూములను లాక్కొవాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీఆర్‌డీఏ పరిధిలో ల్యాండ్‌ ఫూలింగ్‌ చేసే సమయంలో చంద్రబాబు ఎలాంటి హామీలు ఇచ్చారో, ఆ తరువాత ఎలా మాట మార్చారో అందరం చూశామన్నారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన సీఐఐ సదస్సులో కూడా టీడీపీ చేసిన నిర్వాకం బయటపడిందన్నారు. ఏమీ లేని దాన్ని గ్లోరిఫై చేస్తు చంద్రబాబు చేసిన ప్రచారం ప్రపంచమంతటికి తెలుసన్నారు. వరుస రెండేళ్లుగా విశాఖలో సీఐఐ సదస్సు నిర్వహించి ఏ మేరకు ఫలితాలు రాబట్టారో రాష్ట్ర ప్రజలకు తెలిసిందే అన్నారు. ఏ రకంగా పేదల తాలూకు భూములు లాక్కొవాలని ఎంవోయులు కుదుర్చుకున్నారని విమర్శించారు. పేద రైతుల కడుపు కొట్టేందుకే పార్టనర్‌షిప్‌ సమ్మిట్లు ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న భూ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. వుడా పరిధి 250 కిలోమీటర్ల వరకు ఉందని, మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిమిలో 550 ఎకరాలు భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు జీవోలు విడుదల చేశారన్నారు. ల్యాండ్‌ఫూలింగ్‌కు సంబంధించిన జీవో రెవెన్యూ శాఖ ఇవ్వాలని, అయితే ఇక్కడ మున్సిపల్‌ శాఖ జీవో ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ, మంత్రి గంటా శ్రీనివాసులు ఇద్దరు వియ్యంకులని, వీరిద్దరు కలిసి విశాఖలో రూ.500 కోట్ల విలువ చేసే భూములను కొల్లగొట్టేందుకు పేదల వద్ద అగ్రిమెంట్లు రాయించుకొని దోపిడీ చేయాలని ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. ఈ నిర్ణయంలో ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే వుడా అధికారులు ఈ నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారన్నారు. గతంలో గంటా శ్రీనివాసరావు బ్యాంకులను మోసం చేసి ప్రభుత్వ భూములను ఆయన భూములుగా చూపించిన ఘటనలు చూశామన్నారు. చంద్ర బాబుకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి గంటాను భర్తరఫ్‌ చేయాలని, ఆయనపై ఏసీబీ విచారణ చేయించాలని గుడివాడ అమర్నాథ్‌ డిమాండ్‌ చేశారు.  ఈ ప్రభుత్వం మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.రెండేళ్లలో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుంది, ఈ రకంగా పేదల భూములను కొట్టేయాలనుకున్న పెద్దలందరిని బోన్‌లో నిలబెడతామని గుడివాడ అమర్నాథ్‌ హెచ్చరించారు.
Back to Top