అమాయ‌క ప్ర‌జ‌ల‌పై టీడీపీ అక్ర‌మ కేసులు

శ్రీ‌కాకుళంః స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని రోడ్డు ఎక్కితే ప్ర‌భుత్వం అన్యాయంగా అమాయ‌క‌ప్ర‌జ‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించి జైల్లో పెడుతుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌కాకుళం జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి మండిప‌డ్డారు. వంశ‌ధార నిర్వాసితులు త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని పోరాడితే టీడీపీ వారిని అన్యాయంగా జైల్లో పెట్టింద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె పాత‌ప‌ట్నం స‌బ్‌జైలు వ‌ద్ద బాధితుల‌ను క‌లుసుకొని వారిని ప‌రామ‌ర్శించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిపాల‌న రానుంద‌న్నారు. 

Back to Top