టీడీపీ చేతిలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ..!

గుంటూరు : తెలుగుదేశం పార్టీ నేత‌లు ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నార‌ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ నిప్పులు చెరిగారు. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావు చేస్తున్న దురాగ‌తాల్ని తెలియ‌ప‌రిచేందుకు శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న పార్టీ నేత జంగా కృష్ణ‌మూర్తి విష‌యంలో పోలీసుల్ని అడ్డు పెట్టుకొని టీడీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న మండి ప్డ‌డారు. య‌ర‌ప‌తినేని చేస్తున్న మైనింగ్ మాఫియా, ప్ర‌భుత్వ వ‌న‌రుల్ని కొల్ల‌గొడుతున్న విష‌యాన్ని సంబంధిత ఆర్డీవో, త‌హ‌శీల్దార్ ల‌కు చెప్పిన‌ప్ప‌టికీ పట్టించుకోవ‌టం లేద‌ని విమ‌ర్శించారు. జంగాను అక్ర‌మంగా నిర్బంధించినంత మాత్రాన నిజాలు దాగ‌వ‌న్న విష‌యాన్ని గుర్తించుకోవాల‌ని చెప్పారు. టీడీపీ అక్ర‌మాల్ని అడ్డుకోవ‌టంతో పాటు జంగా కృష్ణ మూర్తికి పార్టీ శ్రేణులంతా అండ‌గా ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. గుంటూరు లో రాజ‌శేఖ‌ర్ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న‌తో పాటు, బాప‌ట్ల ఎమ్మెల్యే కోన రఘుప‌తి, రాష్ట్ర కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి త‌దిత‌రులు మాట్లాడారు. 
Back to Top