రాష్ట్రం భ్రష్టు పట్టడానికి బిజెపి, టిడిపిలే కారణం

విజయవాడ:   వ్యక్తి ఆరాధన, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే  చంద్రబాబు  దీక్ష చేపట్టారని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుంటానంటూ పదేపదే చెప్పే చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను కూడ తన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకునే యత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. పరిపాలన పరంగా పాటించాల్సిన సంప్రదాయాలను గాలికి వదిలేసి, వ్యక్తిగత ఆడంబరాలు, ఆర్భాటాలకు, ప్రతిష్టలకు ప్రభుత్వం పోతోందని ధ్వజమెత్తారు. 
రాష్ట్రం భ్రష్టు పట్టడానికి ప్రధాన కారణం బిజెపి, టిడిపిల వైఖరే అని ధ్వజమెత్తారు. బిజెపి రాష్ట్రంపై కక్ష గడితే, టిడిపి, చంద్రబాబు నాయుడు లు ప్రజలపై కక్ష కట్టారని ఫలితంగా తీరని నష్టం జరుగుతోందన్నారు. ఈరెండు పార్టీల కారణంగా రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. 
రాష్ట్రంలో ప్రత్యేక హోదా , విభజన అంశాన్ని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన అంశాలను అమలు చేయాలని ప్రతిపక్షంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా, మిత్రపక్షాలుగా ఉంటూ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయన్నారు. ఈ నాలుగేళ్ల పాటు ఆ రెండు పార్టీలు, నాయకులు రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప, ప్రజల ప్రయోజనాలను ఏమాత్రం చూడలేదని బొత్స అన్నారు. ప్రతిపక్షాలు,ప్రజా సంఘాలు, పౌరసంఘాలు చేసిన పోరాటాలపై ప్రభుత్వాలు కళ్లు తెరిచాయి. వైయస్ ఆర్ కాంగ్రెస్,  వైయస్ జగన్ మోహన్ రెడ్డి  చేసిన , చేస్తున్న పోరాటంలో భాగంగానే లోకసభలో  అవిశ్వాసం, రాజీనామాలు చేయడం, నిరవధిక నిరాహార దీక్షలు చేసినా, కేంద్రంలోని  బిజెపికి  చీమ కుట్టినట్లయినా లేకపోగా, రాష్ట్రంలోని టిడిపి నాయకులు అవహేళన చేస్తున్న మాటలు  ప్రజలెవరూ మరచిపోలేదన్నారు..
ఇలా హేళన చేస్తూ  జపాన్ తరహా ఉద్యమాలంటూ మాట్లాడిన చంద్రబాబు గారే,  నిరాహారదీక్ష పేరుతో  ఒక రోజు ధర్మదీక్ష అంటూ సినిమా టైటిల్ తో ముందుకు వచ్చిన విషయం ప్రజలందరూ చూశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు చేసినది రాష్ట్రం కోసం చేసిన దీక్ష కాదని, ఆ రోజు ఆయన తాలూకా జన్మదినం సందర్భంగా , దానిని అధికారికంగా నిర్వహించేందుకు  ప్రభుత్వ డబ్బుతో ఖజానా నుంచి 20 కోట్లకు తక్కువ కాకుండా  ఖర్చు చేశారు. ప్రతిపక్షాలు బంద్ చేస్తే ముఖ్యమంత్రి స్థాయి నాయుకులు ఆర్టీసీకీ 11 కోట్లు నష్టం  వచ్చిందంటూ చెప్పిన చంద్రబాబు, తన పుట్టిన రోజును ఘనంగా నిర్వహించుకోడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఇలాంటి  వ్యక్తి దేశంలో  మరొకరు ఉండరని మండిపడ్డారు. ఆయన చేసిన దీక్ష రాష్ట్రం కోసం చేసినదా? రాజకీయ అవసరాలు, వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేసినదో ప్రజలంతా  తెలుసుకోవాలన్నారు.
తెలుగువారందరూ గౌరవించే ఎన్ టిఆర్ వేషధారణతో హేయమైన ప్రదర్శనలు, వాటిని చూస్తూ ఎంజాయ్ చేసిన ముఖ్యమంత్రిని ఏమనాలని ప్రశ్శించారు. టిడిపి కార్యకర్తలు వీటిని ఏవిధంగా దీనిని సహించారని నిలదీశారు.?  ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి చంద్రబాబునాయుడికి సిగ్గు శరం ఉందా అని ఘాటుగా అడిగారు.  ఇటువంటి చేష్టల ద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారని, వ్యక్తిగత ఆరాధన కోసం ప్రభుత్వ ఖర్చుతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంలో అర్థం లేదన్నారు. 
 ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు కూడా టిడిపి, బిజెపి తాలూకూ చీకటి ఒప్పందాల్లో భాగంగా చేస్తున్నారని, ఈ రెండు పార్టీలు పైకి శతృత్వం ప్రదర్శిస్తున్నా, పూర్తి చిత్తశుద్ధితో ప్రజల కోసం చేస్తున్నవి మాత్రం కాదని కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు. భాగంగా. 
ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటానని చెప్పే చంద్రబాబు నాయుడు, ప్రస్తుత పరిస్థితులను అలాగే వాడుకుంటున్నారన్నారు.
టిటిడి బోర్డు సభ్యులనియామకంలో బిజెపికి చెందిన మహారాష్ట్ర ప్రభుత్వంలోని  మంత్రి భార్యను ఎందుకు నియమించారో చెప్పాలన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ డిఎ నుంచి, బిజెపి మిత్రత్వానికి గుడ్ బై చెప్పామని ప్రచారం చేసుకుని, మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా ఇటువంటి నియామకాలు చేపట్టడంలోని అర్థం మేమిటో ప్రజలకు తెలియదనుకుంటో పొరపాటన్నారు. 
 బిజెపితో కలిసి మీరు  చేస్తున్న రాజకీయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో టిడిపికి  నూకలు చెల్లిపోయాయని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 
20 లక్షల మంది కుటుంబాలకు చెందిన అగ్రిగోల్డు వ్యవహారంలో కూడా బాధితులకు న్యాయం చేయడంలో చిత్తశుద్ది లేదన్నారు. తనకు 25 మంది ఎంపిలను ఇస్తే,ఏదో మేలుచేస్తానని చెపుతున్నచంద్రబాబు ఇప్పుడు తన వద్ద ఉన్న 20 మంది ఎంపిలతో ఏం సాధించారని ఇది ఉట్టిని ఎక్కలేనన్న సామెతగా ఉందంటా ఎద్దెవా చేశారు. 
ఆయన బూటకపు కార్యక్రమాలను, నీచమైన రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలను కోరారు. 
చంద్రబాబు నాయకుడి లాంటి టక్కుటమార నాయకుడు మాయల్లో పడవద్దు. హోదా, వంటి అంశాలను సాధించేందుకు ప్రతిపక్షంగా, ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. 
అగ్రిగోల్డు బాధితులకు న్యాయం జరగకుండా వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు అడ్డం పడుతున్నారంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, ఇలా ఎవరైనా బెదిరిస్తే చర్యలుతీసుకోలేని చేతకాని దద్దమ్మ,చవటా ప్రభుత్వంలో ఉన్న పెద్దలంటూ ఘాటుగా అడిగారు. అగ్రిగోల్డు భాదితులకు న్యాయం జరిగేంత వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 
Back to Top