టీడీపీకి పుట్టగతులుండవ్

పార్లమెంట్, తిరుపతి సాక్షిగా ఇచ్చిన హామీలకు తూట్లు
హోదాను విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎమ్మెల్యేల ఫైర్
కాంగ్రెస్ కు పట్టిన గతే టీడీపీ, బీజేపీలకు పడుతుందని హెచ్చరిక
వైఎస్ జగన్ నాయకత్వంలో హోదాను సాధించుకుంటామని ధీమా

ఏపీః ప్రత్యేకహోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని ఫైరయ్యారు. చంద్రబాబు కేంద్రంతో తెగదెంపులు చేసుకొని బయటకు రావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఐక్య ఉద్యమానికి కదిలి రావాలని సూచించారు. రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని, హోదా తీసుకురాకపోతే బాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. హోదా కోసం వైఎస్ జగన్ ఎన్నో దీక్షలు, పోరాటాలు చేశారని....ప్రధాని, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారని కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి చెప్పారు. హోదా వస్తేనే ఏపీ బాగుపడుతుందని, వైఎస్ జగన్ నాయకత్వంలో హోదా వచ్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. 

అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామంటూ బీజేపీ,  15 ఏళ్లు ఇవ్వాలంటూ చంద్రబాబు మాట్లాడారని....ఇవాళ ఇచ్చిన మాట తప్పి ప్రజలను దగా చేస్తున్నారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న ఒడ్డు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు, ఉద్యోగఅవకాశాలు వస్తాయని చెప్పారు. చంద్రబాబు వేలకోట్లు సంపాదించుకునేందుకే అమరావతి జపం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఏం చేస్తే దానికి తలూపుతూ  బాబు రాష్ట్రాన్ని నట్టేట ముంచుతున్నారని ఫైరయ్యారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత పాలనపై ఎమ్మెల్యే అంజాద్ బాష నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా రెండు ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని ఆక్రోషించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి.  యువతకు మేలు జరగాలన్న ఉద్దేశ్యంతో అధ్యక్షులు వైఎస్ జగన్ అలుపులేని పోరాటం చేస్తున్నారని అంజాద్ బాష చెప్పారు. హోదా సాధించుకునేవరకు  వైఎస్ జగన్ నాయకత్వంలో  పోరాడుతామన్నారు. తిరుపతిలో శ్రీవారి పాదాల సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని.... మోడీ, చంద్రబాబులు విస్మరించడంపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం బాబు రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారని ఫైరయ్యారు. కోట్ల రూపాయలిచ్చి ఎమ్మెల్యేలను కొంటూ బాబు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని ఆగ్రహించారు.  హోదా తీసుకురాకపోతే బాబుకు పుట్టగతులుండవని దుమ్మెత్తిపోశారు. 

చంద్రబాబు హోదా తీసుకురాకపోతే చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం  బాబు హోదాను పణంగా పెడుతున్నాడని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ ఏవిధంగా దెబ్బతిందో...హామీలను విస్మరించిన బీజేపీ, టీడీపీలకు కూడా అదే గతి పడుతుందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. టీడీపీ, బీజేపీలు తుడుచుకుపెట్టుకుపోవడం ఖాయమన్నారు. పార్లమెంట్, తిరుపతి సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. అందుకే అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు . రాష్ట్రంలో టీడీపీని ప్రజలు భూస్థాపితం చేస్తారని, బంగాళాఖాతంలో కలిపేస్తారని చెప్పారు. 

To read this article in English:  http://bit.ly/1WY04hq 


Back to Top