దేవినేని బాబు వచ్చినా గుడివాడలో టీడీపీ జెండా ఎగరదు

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవికోసం అడ్డదారులు తొక్కి పారిపోయిన టీడీపీ
వైయస్‌ఆర్‌ సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని

కృష్ణా: గుడివాడ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి దక్కించుకోవడానికి అడ్డదారులు తొక్కి తెలుగుదేశం పార్టీ నాయకులు చివరకు పారిపోయారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. అవిశ్వాసం పెడితే ఓటమి తప్పదని భావించి కుంటిసాకుతో సమావేశం జరగనివ్వకుండా చేశారన్నారు. గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ చవట దద్దమ్మలు గుడివాడ వైస్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకోవడానికి రాష్ట్రస్థాయి వరకు రాజకీయాలు నడిపారన్నారు. కౌన్సిలర్లతో అనేకసార్లు సమావేశాలు జరిపారని, మున్సిపల్‌ సమావేశం జరిగితే టీడీపీ రోడ్డున పడుతుందనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కలెక్టర్‌ చేత రద్దు చేయించారన్నారు. దేవినేని ఉమా గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తానన్నారని, దేవినేని ఉమా బాబు వచ్చినా జెండా ఎగరదన్నారు. గుడివాడ ప్రజలు టీడీపీ జెండాను చించి నాలుగు ముక్కలు చేసి పాతాళంతో సమా«ధి కట్టారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కోవడానికి వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉందన్నారు.
Back to Top