ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీకి గుణ‌పాఠం త‌ప్ప‌దు

అనంత‌పురం: త‌్వ‌ర‌లో జ‌రుగ‌నున్న శాస‌న మండ‌లి ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీకి గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు చ‌వ్వా రాజ‌శేఖ‌ర‌రెడ్డి హెచ్చ‌రించారు. ప‌శ్చిమ రాయ‌ల‌సీమ పట్టభద్రుల నియొజకవర్గ శాసన మండలి స్థానానికి వైయ‌స్ఆర్ సీపీ  తరపున పోటి చేస్తున వెన్నపూస గోపాల్ రెడ్డికి మద్దతుగా చవ్వా రాజశేఖర్ రెడ్డి  అనంతపురం న‌గ‌రంలో ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా స్థానిక రోడ్లు,  భవనములు శాఖ కార్యాలయం, నేషనల్ హైవేస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౄహ నిర్మాణ సంస్థ కార్యాలయం, అసిస్టెంట్ ప్రొజెక్ట్ డైరెక్టెర్ వారి కార్యాలయం- జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివౄది సంస్థ- డీఆర్‌డీఏ కార్యాల‌యం, జిల్లా ప్రభుత్వ‌ ఉద్యోగుల శిక్షణా కేంద్రం, ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రం, ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజేక్ట్  కార్యాలయం, మండల వ్యవసాయ అధికారి కార్యాలయం,  ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా అటవీ శాఖ వారి కార్యాలయాల‌లో ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ..ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, ఉద్యోగం ఇవ్వ‌క‌పోతే నెల‌కు రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తాన‌ని హామీ ఇచ్చి మాట త‌ప్పార‌న్నారు. టీడీపీ స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు గ‌డుస్తున్నా ఇంత‌వ‌ర‌కు ఏ ఒ క్క‌రికి ఉద్యోగం ఇవ్వ‌లేద‌ని, నిరుద్యోగ భృతి ఊసే లేద‌న్నారు. నిరుద్యోగుల‌ను మోసం చేసిన చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ప‌ట్ట‌భ‌ద్రులు స‌రైన గుణ‌పాఠం చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గోపాల్‌రెడ్డికి మొద‌టి ప్రాధాన్య‌త ఓటు వేసి అత్య‌ధిక మెజారిటీతో గెలిపించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

Back to Top