టీడీపీలో ఎవరూ మిగలరు

  • వైయ‌స్ కుటుంబాన్ని వీడే ప్ర‌సక్తే లేదు
  • టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
  • వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్ అప్పారావు

  • హైదరాబాద్ః టీడీపీ ఎన్ని ప్ర‌లోభాల‌కు గురి చేసినా వైయ‌స్ కుటుంబాన్ని వీడే ప్ర‌సక్తే లేద‌ని కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్ అప్పారావు అన్నారు. కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నార‌ని టీడీపీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. హైద‌రాబాద్ పార్టీ కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో ఆయ‌న మాట్లాడారు.

    తాము దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి శిష్యుల‌మ‌ని పేర్కొన్నారు. జీవితాంతం ఆ కుటుంబంతోనే ఉంటామని స్ప‌ష్టం చేశారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేక‌నే టీడీపీ ఇలాంటి దుష్ప‌చారాల‌కు పాల్ప‌డుతుంద‌ని నిప్పులు చెరిగారు. 

    వైయ‌స్ జ‌గ‌న్‌పై ప్ర‌జాభిమానం అంతకంతకూ పెరుగుతుందన్నారు. ఇప్ప‌టికే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లామా అని బాధపడుతున్నారని మేక్ ప్రతాప్ అప్పారావు తెలిపారు. మ‌రో సంవ‌త్స‌రం త‌ర్వాత టీడీపీలో ఎవ‌రూ మిగ‌ల‌ర‌ని అంతా వైయ‌స్సార్‌సీపీలోకి క్యూ క‌డ‌తార‌ని చెప్పారు. 
Back to Top