చేనేతలను మోసం చేస్తున్న టీడీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

–చేనేత రిలేదీక్షల్లో వైయస్సార్‌సీపీ సీజీసీ సభ్యులు గ్రిరాజు నగేష్‌
ధర్మవరం: చేనేతలకు సంక్షేమ పథకాలను దూరం చేస్తూ.. వారిని ఇబ్బందుల పాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులును చేనేతలు నిలదీయడమే అందుకు నిదర్శనమని వైయస్సార్‌సీపీ సీజీసీ సభ్యులు గిర్రాజు నగేష్‌ పేర్కొన్నారు. ముడిపట్టు రాయితీ బకాయిల చెల్లింపు కోసం వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు ఆ పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు బీరే ఎర్రిస్వామి నేతృత్వంలో రెండవ రోజున జరిగాయి. ఈ దీక్షలను మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, గిర్రాజు నగేష్‌లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గిర్రాజు నగేష్‌ మాట్లాడుతూ... గతంలో కేతిరెడ్డి హయాంలో చేనేతలకు అనేక సంక్షేమ పథకాలు అందేవని, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటినీ ఎత్తివేసి చేనేత రంగానికి తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ముడిపట్టు రాయితీ దాదాపు 19 కోట్లు బకాయిలు పడ్డారని, చంద్రబాబు ధర్మవరం వచ్చి బాహాటంగా ప్రకటించి పోయిన రూ.1,000 సబ్సీడీని కూడా అటకెక్కించారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో చేనేతలకు ఒక్కో సంక్షేమపథకాన్ని దూరం చేస్తూ వస్తోందని, త్వరలోనే ఈ తెలుగుదేశం పార్టీని తరమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేతలకు ఇవ్వాల్సిన ముడిపట్టు రాయితీ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చేనేతలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు ఆపేదిలేదన్నారు. ఈ దీక్షల్లో చేనేత నాయకులు యుగంధర్, నాగభూషణం, కుల్లాయప్ప, అదిశేషయ్య, నాగరాజు, వెంగముని, ఆదిరెడ్డి, లోకేష్, వెంకటేష్, హరి, వీరేంద్ర, నాగార్జున, వెంకటేష్, మురళి, నందీష్, గిరినాథరెడ్డి, కళ్యాణ్‌కుమార్, శ్రీనివాసులు, మధుసూధనరెడ్డి, ఆనంద్‌కుమార్, సూర్యనారాయణ, కాశీంసాబ్, నాగరాజు, వెంకటేషులు, అమానుల్లా, శ్రీనివాసులు, కంచం రామాంజి, సి శ్రీనివాస్, ప్రేమ్‌కుమార్, శివ, వెంకటరమణ, చంద్రశేఖర్, నారాయణస్వామి, కుమ్మర ఈశ్వరయ్య, మాదవ రామాంజినేయులు, వెంకటేష్‌; వన్నూర్‌స్వామి, పాండురంగ, ప్రవీణ్, ఎస్‌ ఉదయ్‌లు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు గడ్డం కుళ్లాయప్ప, నాయకులు ఎస్‌వి రమణారెడ్డి, బీరే జయచంద్ర, జాకీర్, శేఖర్‌రెడ్డి, కొళ్లమోరం కేశవరెడ్డి, అంజి, పాలబావి శ్రీనివాసులు, వడ్డేబాలాజి తదితరులు పాల్గొన్నారు.

Back to Top