టీడీపీ బంగాళా ఖాతంలో క‌ల‌వ‌డం ఖాయంగుంటూరు(ప‌ట్నంబ‌జారు):  టీడీపీ  ఆరాచ‌క పాల‌న‌ పునాదులు క‌దులుతున్నాయ‌న‌డానికి టీడీపీ నుంచి వైయ‌స్సార్‌సీపీలోకి చేరిక‌లే నిద‌ర్శ‌మ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అరండ‌ల్‌పేట‌లోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో మాజీ కార్పొరేటర్లు తుమ్మేటి శార‌దా శ్రీ‌నివాస్‌, ఉడ‌తా కృష్ణ‌, బ‌త్తుల దేవానంద‌ర్‌ల‌తో పాటు 33, 38, 43డివిజ‌న్‌ల‌కు చెందిన మ‌ద్ద‌తుదార్లు పెద్దఎత్తున వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మ‌ట్లాడుతూ... పీడీ యాక్టులు పెట్ట‌డం సిగ్గు చేట‌న్నారు. టీడీపీని బంగాళా ఖాతంలో క‌లిపే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌న్నారు. అనంత‌రం పార్టీలో చేరిన వారికి కండువాలు క‌ప్పి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు ఆంజ‌నేయులు, రాష్ట్ర కార్య‌ద‌ర్శులు రాతంశెట్టి రామాంజ‌నేయులు, థామ‌స్ నాయుడు, పార్టీ సంయుక్త కార్య‌ద‌ర్శి షేక్ గులాంర‌సూల్‌, యువ‌జ‌న విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉమామ‌హేశ్వ‌ర‌రెడ్డి త‌దిత‌రులున్నారు. 
Back to Top