ప్రజాప్రతినిధుల హక్కులు కాలరాస్తున్న టీడీపీ

కర్నూలు: టీడీపీ ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కర్నూలు జిల్లా కలెక్టర్  విజయ మోహన్ను ఎమ్మెల్యేలు బుధవారం కలిశారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులపై కలెక్టర్తో వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు చర్చించారు. టీడీపీ ఇంఛార్జులకు నిధులు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సాయి ప్రసాద్రెడ్డి, గుమ్మనూరి జయరాములు, గౌరు చరితారెడ్డి, బాలనాగిరెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top