వైయస్ ఆర్ కాంగ్రెస్ శ్రేణులపై టిడిపి కక్ష సాధింపు

కడప:  వైయస్ ఆర్ కాంగ్రెస్
పార్టీ అభిమానులు, కార్యకర్తలపై టిడిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ముఖ్యంగా కడప జిల్లాలో పరిస్థితి
దారుణంగా ఉందన్నారు. కడపలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
పోలింగ్ బూత్ లెవల్ శిక్షణా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. సీనియర్ నాయకులుసజ్జల
రామకృష్టా రెడ్డి, ధర్మాన
ప్రసాద రావు, భూమన
కరుణాకర్ రెడ్డి, ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే
అంజాద్ బాషా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ కడప నగరంలో
సుమారు లక్ష ఓట్లు అకారణంగా తీసేశారని తెలిపారు. సాధారణ ఓటరుకు అండగా ఉండాల్సిన
బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇలా చేస్తే
ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేసే
ప్రయత్నం జరుగుతోందని అన్నారు. శిక్షణా తరగతుల్లో ముందుగా ఇటీవల 
మృతి
చెందిన పార్టీ నేత శ్రీనివాస రెడ్డికి సంతాపం  తెలిపారు.


Back to Top