బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర


విజయవాడ: ప్రత్యేక హోదా సాధన కోసం నిర్వహించే బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు చంద్రబాబు సర్కార్‌ కుట్రలు పన్నుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మండిపడ్డారు. విజయవాడ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 16వ తేదీన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన కమిటీ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు వస్తున్న మద్దతును చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు. బంద్‌లో పాల్గొంటే కేసులు పెడతామని పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఇప్పటికీ పలువురు వైయస్‌ఆర్‌ సీపీ నాయకులకు నోటీసులు సైతం అందజేశారన్నారు. ఒక వైపు ప్రత్యేక హోదా కావాలంటూనే మరో వైపు దాన్ని కాలరాసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 
Back to Top