దేవుడి పేరుతో టీడీపీ వేలకోట్ల అవినీతి

  • సదావర్తి’ బాబు అవినీతికి మచ్చుతునక
  • వైయస్‌ఆర్‌ సీపీతో భాగస్వాములై టీడీపీ కుంభకోణాలను అరికట్టండి
  • రాష్ట్ర మేలు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం
  • చంద్రబాబు అవినీతి బాగోతాలపై సమగ్ర విచారణ జరగాలి
  • భూబాధితులకు వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుంది
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్‌:  తెలుగుదేశం ప్రభుత్వం దేవుడి సొమ్మును కాజేస్తూ, దేవుడినే మింగేయాలని చూస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. సదావర్తి భూములకు సంబంధించి రూ. 22.4 కోట్లకు చంద్రబాబు తన బినామీకి కట్టబెట్టడంతో ఎంత దోపిడీ జరిగిందో ప్రజలకు అర్థం అవుతుందన్నారు. చంద్రబాబు భూ దోపిడీలపై వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదావర్తి భూములపై కోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు భూ కుంభకోణాలకు మచ్చు తునక అని అభిప్రాయపడ్డారు. దేవుడి పేరు చెప్పుకుంటూ వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో ప్రాజెక్టు పేరుతో దేవుడి భూములను చంద్రబాబు తన బినామీలకు అప్పగించారని గుర్తు చేశారు. అదే విధంగా గోదావరి, కృష్ణా పుష్కరాల పేరుతో వేల కోట్లు దండుకున్నాడని మండిపడ్డారు. 

బాబు అవినీతి మా దృష్టికి తీసుకురండి...
చంద్రబాబు అవినీతిని అరికట్టేందుకు ప్రజలంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో భాగస్వాములు కావాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఎక్కడెక్కడ ప్రభుత్వం భూదోపిడీలకు పాల్పడుతుందో.. ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే సదావర్తి భూముల విషయంలో ఏ విధంగా పోరాటం చేశామో.. అదే విధంగా పోరాడి ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడుతామన్నారు. రాష్ట్రానికి మేలు జరిగే ఏ పోరాటానికైనా వైయస్‌ఆర్‌ సీపీ వెనుకాడదన్నారు. బాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదల భూములను ప్రభుత్వం లాక్కొంటుందని, భూబాధితులకు వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

వేలంపాట నిస్పక్షపాతంగా జరగలేదు
సదావర్తి భూముల్లో నిన్న జరిగిన వేలంపాట నిష్పక్షపాతంగా జరగలేదని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. కోర్టు అనుమతి లేకుండా టీడీపీ మంత్రులు చెన్నైలో జరిగిన వేలంపాటలో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీలు, మంత్రులు వేలంపాటలో పాల్గొనేవారిని బెదిరించడం వల్లే వేలం సక్రమంగా జరగేలదన్నారు. సక్రమంగా జరిగివుంటే రూ. వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రూ.60 కోట్లకు బిడ్‌ వేయడంతోనే ఆ మాత్రం ధరైనా వచ్చిందన్నారు. వేలంపాట జరుగుతుందని ఏ నేషన్ల్ మీడియాలోనైనా ప్రభుత్వం పబ్లిష్‌ చేసిందా అని ప్రశ్నించారు. 
Back to Top